టీమిండియా మాజీ ఆటగాడు సురేష్‌ రైనా సంచలన క్యాచ్‌తో రైనా మరోసారి మెరిశాడు. రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌ తరపున ఆడుతున్న రైనా సెమీఫైనల్‌-1లో భాగంగా ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో మ్యాచ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ వేసిన అభిమాన్యు మిథున్‌ బౌలింగ్‌లో.. బెన్‌ డంక్‌ పాయింట్‌ దిశగా ఆడాడు. ఈ క్రమంలో పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రైనా.. డైవ్‌ చేస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. రైనా స్టన్నింగ్‌ క్యాచ్‌తో బ్యాటర్‌తో పాటు భారత ఫీల్డర్లందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)