వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్‌-ఆఫ్గానిస్తాన్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌పై స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి సీరియస్‌ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 49 ఓ‍వర్‌లో రషీద్‌ ఖాన్‌ ఔట్‌ కాగానే నవీన్ ఉల్ హక్‌ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ అందరూ కోహ్లి, కోహ్లి అని గట్టిగా అరవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో నవీన్‌ తన ఎదుర్కొన్న తొలి బంతిని ఫైన్ లెగ్ వైపు ఆడాడు. తొలి పరుగు పూర్తి చేసుకున్న నవీన్‌ రెండో పరుగు కోసం పరిగెత్తాడు.

అయితే ఫైన్‌ లెగ్‌లో ఉన్న కోహ్లి అద్బుతంగా ఫీల్డింగ్‌ చేసి వికెట్‌ కీపర్‌ రాహుల్‌ వైపు త్రో చేశాడు. రాహుల్‌ బంతిని సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో విరాట్‌ కోహ్లి ఒక్కసారిగా రాహుల్‌ వైపు చూస్తూ కోపంతో ఊగిపోయాడు. ఒక వేళ రాహుల్‌ బంతిని సరిగ్గా పట్టి స్టంప్స్‌ను పడగొట్టి నవీన్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్‌-2023 సందర్భంగా కోహ్లి,నవీన్‌ ఉల్‌- హక్‌ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

Virat Kohli Fumes After Missed Run-Out Chance Involving Naveen-ul-Haq During Cricket World Cup 2023

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)