తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసిన సంగతి విదితమే. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 110 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 46 సెంచరీ నమోదు చేశాడు.ఓవరాల్‌గా ఇప్పటివరకు విరాట్‌ కోహ్లి కెరీర్‌లో ఇది 74 అంతర్జాతీయ సెంచరీ. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ అసాంతం రాణించిన కోహ్లికి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌ అవార్డు దక్కింది.

ఈ మ్యాచ్‌లో అద్భతమైన హెలికాప్టర్ షాట్‌ బాదిన విరాట్‌ కోహ్లి.. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని గుర్తు చేశాడు. భారత ఇన్నింగ్స్‌ 44 ఓవర్‌ వేసిన కసున్ రజిత బౌలింగ్‌లో నాలుగో బంతిని ఫ్రంట్‌ఫుట్‌ వచ్చిన విరాట్‌ లాంగ్‌ ఆన్‌ దిశగా 97 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)