వరల్డ్ కప్ లో ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఓడిపోవడంతో టీమిండియా ఆటగాళ్ల వేదన అంతా ఇంతా కాదు. అహ్మదాబాద్ లో నిన్న మ్యాచ్ ముగిశాక టీమిండియా డ్రెస్సింగ్ రూంలో సీరియస్ వాతావరణం నెలకొంది. మెడల్ సెర్మనీలో ఆటగాళ్ల ముఖాలపై నవ్వు కనిపించినా, గుండెల్లో బాధ సుడులు తిరుగుతోంది. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూమ్ లోకి అడుగుపెట్టారు. ఆటగాళ్ల మనసులు తేలికపరిచేందుకు ప్రయత్నించారు.

ముఖ్యంగా, తీవ్ర విచారంలో ఉన్న పేసర్ మహ్మద్ షమీని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకున్నారు. వీపుపై చేయి వేసి వాత్సల్యంతో నిమురుతూ షమీని ఊరడించారు. దీనికి సంబంధించిన ఫొటోను షమీ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దురదృష్టవశాత్తు నిన్న మాకు కలిసి రాలేదు. ఈ టోర్నీ ఆసాంతం టీమిండియాకు, నాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా మా డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చి మాలో స్ఫూర్తిని ఇనుమడింపజేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మేం తప్పకుండా పుంజుకుంటాం" అని షమీ ట్వీట్ చేశాడు.

PM Modi Hugs Mohammed Shami After India Lose WC Final Vs Australia

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)