జూన్ 4న ధోని, సాక్షిసింగ్ తమ 13వ వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సాక్షి ధోని.. ''ధోని బెడ్‌రూంలోనూ ఏం చేస్తున్నాడో చూడండి'' అంటూ ఒక పాత ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీషేర్ చేసింది. ఆ ఫోటోలో ధోని మంచంపై పడుకొని ట్యాబ్‌లో వీడియో గేమ్ ఆడుతూ చాలా బిజీగా కనిపించాడు.
ఇది చూసిన సాక్షి.. ''బెడ్‌రూంలో కూడా వీడియో గేమ్స్ ఆడతావా.. నాకంటే నీకు వీడియో గేమ్ ఎక్కువయిందా'' అంటూ ధోని కాళ్లను కొరుకుతున్నట్లుగా ఉంది. ''మిస్టర్ స్వీటీ నుంచి అటెన్షన్ పక్కకు తప్పిన సమయంలో.. వీడియో గేమ్స్ వర్సెస్ వైఫ్(ముఖ్య గమనిక: ఈ ఫోటోకు అసలైన అర్థం కేవలం మా ఇద్దరి క్లోజ్ ఫ్రెండ్స్‌కు మాత్రమే అర్థమవుతుంది)'' అంటూ క్యాప్షన్ జత చేసింది.
Here's Tweet
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)