ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు దుమ్మురేపింది. ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. హామిల్టన్‌ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది.ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42)కు తోడు యస్తికా భాటియా అర్ధ శతకంతో రాణించడంతో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ 40.3 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్‌ అయింది. తద్వారా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మిథాలీ సేన 110 పరుగులతో సునాయాస విజయం సాధించి సెమీస్‌ మార్గాలను సుగమం చేసుకుంది.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)