భారత మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్‌కు గోవా ప‌ర్యాట‌క శాఖ నోటీసులు జారీ చేసింది. మోర్జిమ్‌లో ఉన్న విల్లా రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండానే వాడుకుంటున్న‌ట్లు యువీపై ఫిర్యాదు న‌మోదు అయ్యింది. ఈ కేసులో డిసెంబ‌ర్ 8వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ టూరిజం శాఖ ఆదేశించింది. హోమ్‌స్టేగా వాడుతున్న విల్లాకు గోవా ప‌ర్యాట‌క శాఖ నుంచి రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. కాసా సింగ్ అని ఆ విల్లాకు యువీ పేరు పెట్టుకున్నాడు.ప్రాప‌ర్టీని రిజిస్ట‌ర్ చేసుకోలేదు కాబట్టి, ల‌క్ష‌రూపాయ‌లు జ‌రిమానా క‌ట్టాల‌ని ఆ నోటీసులో పేర్కొన్నారు.నార్త్ గోవాలో ఉన్న ఆ విల్లాకు న‌వంబ‌ర్ 18వ తేదీన నోటీసులు ఇచ్చారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)