టీ20 వరల్డ్‌కప్ 2024 ముగిసిన అనంతరం భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటలో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఈ పర్యటన వివరాలను జింబాబ్వే క్రికెట్ బోర్డు కొద్ది సేపటి క్రితం వెల్లడించింది.
జింబాబ్వే క్రికెట్ చైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ ట్వీట్ చేశాడు. మా దేశంలో ఈ సంవత్సరం జరిగే అతిపెద్ద అంతర్జాతీయ ఈవెంట్ ఇదే. టీమిండియాకు ఆతిథ్యమిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా దేశ పర్యటనకు ఒప్పుకున్నందుకు బీసీసీఐకి ధన్యవాదాలు అంటూ తవెంగ్వా ట్వీట్‌లో పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే తమ క్రికెటర్లకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో జింబాబ్వే బోర్డుకు భారత పర్యటన ద్వారా భారీ లబ్ది చేకూరనుంది.
Here's News
JUST IN: Zimbabwe to host India for T20I series
Details 🔽https://t.co/kqSK4dcolC pic.twitter.com/xnN6N6ReL2
— Zimbabwe Cricket (@ZimCricketv) February 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)