కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో ఆఖరి రోజు బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. భారత షట్లర్‌ లక్ష్య సేన్‌ ఫైనల్లో సత్తా చాటాడు. మలేషియా ప్లేయర్‌ ఎన్‌జీ జీ యోంగ్‌ను ఓడించాడు. తద్వారా పసిడి పతకం గెలిచాడు. వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సాధించిన 20 ఏళ్ల లక్ష్య సేన్‌కు కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఇదే మొదటి టైటిల్‌. ఈ విజయంతో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పతకం గెలిచిన బ్యాడ్మింటన్‌ స్టార్లు ప్రకాశ్‌ పదుకొణె(1978), సయ్యద్‌ మోదీ(1982), పారుపల్లి కశ్యప్‌(2014) తదితరుల సరసన నిలిచాడు. కాగా అంతకుముందు తెలుగు తేజం పీవీ సింధు.. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)