పుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ.. తన అభిమాని, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూతురు జివా ధోనికి గిఫ్ట్ పంపించాడు. తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి జివాకు పంపించాడు. అభిమాన ఆటగాడి నుంచి అందిన కానుకను చూసుకుంటూ జివా ధోని మురిసిపోతోంది. ఆ జెర్సీ వేసుకుని తీసుకున్న ఫొటోను ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. ఈ ఫొటోలో జెర్సీపై పారా జివా(జివా కోసం) అంటూ మెస్సీ చేసిన సంతకం కనిపిస్తోంది.
క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ తనకెంతో ఇష్టమైన ఆట అంటూ మహేంద్ర సింగ్ ధోని గతంలో చాలాసార్లు చెప్పారు. తండ్రిలాగే జివాకు కూడా ఫుట్ బాల్ ఆటంటే చాలా ఇష్టం. అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ ఆటను తండ్రితో కలిసి చూస్తుంటుంది. ఈ క్రమంలో మెస్సీ ఆటోగ్రాప్ చేసిన జెర్సీ అందుకోవడంపై జివా సంతోషం వ్యక్తంచేస్తోంది. ఇన్ స్టా వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది.
Here's Ziva Tweet
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)