లవ్లీనా బొర్గొహెయిన్‌ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా అవతరించింది. ‘మాగ్నిఫిసెంట్‌ మేరీ’ తర్వాత పతకం ముద్దాడుతున్న రెండో మహిళగా ఘనకీర్తిని అందుకుంది. టోక్యో క్రీడల్లో భారత బాక్సింగ్‌కు 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆమె తొలి పతకం అందించింది. అంతేకాదు.. అరంగేట్రం మెగా క్రీడల్లోనే పోడియంపై నిలబడిన బాక్సర్‌గా దేశానికి వన్నె తెచ్చింది.

అంతర్జాతీయ బాక్సింగ్‌లో అంతగా అనుభవం లేని లవ్లీనాకు సెమీస్‌ పోరు సులభం కాదని అందరికీ తెలుసు. ప్రత్యర్థి సుర్మెనెలి (టర్కీ) స్వర్ణ పతకానికి ఫేవరెట్‌! ఈ ఏడాది ఆమె రెండు అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణాలు గెలిచి మంచి ఫామ్‌లో ఉంది. గతంలో మిడిల్‌ వెయిట్‌ (75 కిలోలు) ఆడిన ఆమె ఈ సారి 69కిలోల విభాగంలో తలపడింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 16సార్లు పతకాలు కొల్లగొట్టింది. పిడిగుద్దులు, హుక్స్‌, బాడీ షాట్స్‌తో విరుచుకుపడే సుర్మెనెలిపై లవ్లీనా స్ఫూర్తిదాయకంగా పోరాడింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)