Neeraj Chopra Wins Diamond League Title: డైమెండ్ లీగ్ టైటిల్ గెలిచిన నీరజ్ చోప్రా, తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన జావెలిన్ త్రోయర్
జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమెండ్ లీగ్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు. తొలి త్రోను ఫౌల్‌గా ప్రారంభించినా.. ఆ తర్వాత 88.44 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి డైమెండ్ లీగ్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు.
జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమెండ్ లీగ్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు. తొలి త్రోను ఫౌల్‌గా ప్రారంభించినా.. ఆ తర్వాత 88.44 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి డైమెండ్ లీగ్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఆ తర్వాత ప్రయత్నాల్లో జావెలిన్‌ను 88.00 మీ, 86.11మీ, 87.00మీ, 83.60 మీటర్ల దూరం విసిరాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకడ్ 86.94 మీటర్ల దూరం విసిరి రెండవ స్థానంలో నిలిచాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఈ ఇండియన్, వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్, డైమండ్ లీగ్‌లోనూ చాంపియన్‌గా నిలిచాడు.
Making history time and again. A big salute to the man @Neeraj_chopra1 for his consistency and talent. Congratulations to the King of Javelin for being the first Indian ever #DiamondLeague Champion 🔥 Keep shining 🇮🇳 pic.twitter.com/zqoVWbb0B9
— Suresh Raina🇮🇳 (@ImRaina) September 9, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 09, 2022 05:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

