జమైకా అథ్లెట్‌ దిగ్గజం ఉసెన్‌ బోల్ట్‌కు చేదు అనుభవం ఎదురైంది. బోల్డ్‌ అకౌంట్‌ నుంచి దాదాపు 12 మిలియన్‌ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 97 కోట్ల 60 లక్షలు) మాయమైనట్లు సమాచారం. అకౌంట్‌ నుంచి మాయమైన డబ్బంతా బోల్ట్‌ లైఫ్‌టైమ్‌ సేవింగ్‌ డబ్బులని అతని లాయర్‌ లింటన్‌ పి. గార్డన్‌ తెలిపారు. కింగ్‌స్టన్‌ అనుబంధ కంపెనీలో స్టాక్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌లో బోల్ట్‌ పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. తాజాగా షేర్స్‌లో నష్టాలు రావడంతో బోల్ట్‌ అనుమతి లేకుండానే అతని అకౌంట్‌ నుంచి డబ్బు మాయం చేశారని లాయర్‌ తెలిపారు. ప్రస్తుతం బోల్డ్‌ అకౌంట్‌లో కేవలం 12వేల డాలర్లు మాత్రమే మిగిలాయన్నారు. ఈ వ్యవహారంపై తాము కోర్టులో కేసు వేయనున్నట్లు బోల్ట్‌ తరపు లాయర్‌ గార్డన్‌ వెల్లడించారు.

Here's NDtv Report

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)