భారత దేశ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఒలింపిక్ విజేతలను కలిశారు. ఒలింపిక్స్‌లో కంచుమోత మోగించిన మను భాకర్, స్వప్నిల్ కుశాలె వరుసగా రెండో కాంస్యం గెలుపొందిన హాకీ ఆటగాళ్లు, యువరెజ్లర్ అమన్ షెహ్రావత్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు కొద్దిలో పతకం చేజార్చుకున్న షట్లర్ లక్ష్య సేన్‌తో ప్రధాని ముచ్చటించారు. భారత ఒలింపిక్ బృందంతో ప్రధాని సంభాషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘‘పారిస్ ఒలింపిక్స్‌లో ఈ యువ ఆటగాళ్లు మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మరిన్ని కొత్త కలలు, ఆశయాలతో ముందుకెళ్దాం. వాటికి సాకారం కోసం నిరంతరం కృషి చేద్దాం’’ అని క్రీడాకారులను ప్రోత్సహించారు. ఇక ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన షూటర్ మను బాకర్.. తన పిస్టల్‌ను ప్రధాని మోదీకి చూపించి దాని గురించి వివరించింది
Here's Video
#WATCH | PM Narendra Modi meets the Indian contingent that participated in #ParisOlympics2024, at his residence. pic.twitter.com/XEIs5tHrrI
— ANI (@ANI) August 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)