అమెరికాలోని యూజీన్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్‌లో ఇద్ద‌రు భార‌త అథ్లెట్లు చ‌రిత్ర సృష్టించారు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఇద్ద‌రు ఇండియ‌న్లు ఫైన‌ల్ చేర‌డం అథ్లెటిక్స్ హిస్ట‌రీలో ఇదే తొలిసారి. ఒలింపిక్ మెడ‌ల్ విజేత నీర‌జ్ చోప్రా ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించారు. హీట్స్ తొలి ప్ర‌య‌త్నంలోనే నీర‌జ్ త‌న జావెలిన్‌ను 88.39 మీట‌ర్ల దూరం విసిరాడు. మ‌రో అథ్లెట్ రోహిత్ యాద‌వ్ కూడా ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించాడు. రోహిత్ త‌న జావెలిన్‌ను 80.42 మీట‌ర్ల దూరం విసిరాడు.భార‌త కాల‌మానం ప్ర‌కారం ఆదివారం ఉద‌యం ఫైన‌ల్ ఈవెంట్ జ‌ర‌గ‌నున్న‌ది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)