తిరుమలలో లడ్డూ (Tirupati Laddoos) వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది.తాజాగా ఈ లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ఆలయ (Chief Priest of Ram Janmabhoomi) ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ స్పందించారు. ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్రగా ఆయన అభివర్ణించారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన విశ్వహిందూ పరిషత్, వ్యాఖ్యలకు కట్టుబడి ఆ ఆరోపణలను నిరూపణ చేయాలని డిమాండ్

ఓ ఆంగ్ల వార్తా సంస్థతో ఆచార్య సత్యేంద్ర దాస్‌ మాట్లాడుతూ.. తిరుమల బాలాజీ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వెళ్లి.. లడ్డూను ప్రసాదంగా స్వీకరిస్తుంటారని చెప్పారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)