జనసేనకు తాను రాజీనామా చేస్తున్నానని ఆ పార్టీ నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన కోసం నగరంలో ఎంతో కృషి చేశానని, నెల్లూరు నగర నియోజకవర్గానికి అభ్యర్థిగా నారాయణను టీడీపీ మూడు నెలల క్రితం ప్రకటించిందని పేర్కొన్నారు. అప్పటికి జనసేనతో టీడీపీకి పొత్తు లేదని, అయినా తనను వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించొద్దని.. నారాయణతో మనం కలిసి పని చేయాలని పార్టీ పెద్దలు పలువురు తనకు తెలిపారన్నారు.
2016లో సేవ్ నెల్లూరు అంటూ పోరాటం చేసిందే నారాయణ అక్రమాలపైనని, 2019 ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఆయన అక్రమాలపై గళం వినిపించానని తెలిపారు. పార్టీలో తనకంటూ గౌరవం లేకుండా.. తాను భరోసా కల్పించిన ప్రజలకు నమ్మకం పోగొట్టేలా పార్టీలోని పలువురు వ్యవహరించారని.. ఇది సహించలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)