Ganta Srinivasa Rao's Resignation Accepted: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించినట్టు అసెంబ్లీ సమావేశాల వేదికగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. తాజాగా రాజీనామాను ఆమోదించారు.

తన రాజీనామాను ఆమోదించిన రోజు గంటా స్పందిస్తూ.. పవిత్రమైన ఆశయం కోసం తాను రాజీనామా చేశానని చెప్పారు. రాజీనామా తర్వాత స్పీకర్ ను వ్యక్తిగతంగా పలు మార్లు కలిసి రాజీనామాను ఆమోదించాలని కోరినప్పటికీ... ఆయన ఆమోదించలేదని తెలిపారు. తన రాజీనామా లేఖను కోల్డ్ స్టోరేజ్ లో ఉంచిన స్పీకర్... ఇప్పుడు కుట్ర కోణంతో తనను అడగకుండానే ఆమోదించారని మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజీనామాను ఆమోదించారని దుయ్యబట్టారు. తన రాజీనామాను ఆమోదించడంపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)