Andhra Pradesh Assembly Budget Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి (Andhra Pradesh Assembly Budget Session) టీడీపీ సభ్యులు తమ నిరసనలతో సభకు ఆటంకం కలిగించారు. రెడ్‌లైన్‌ దాటి స్పీకర్‌ చాంబర్‌లోకి వెళ్లిన టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ తమ చేతిల్లో ఉన్న పేపర్లను స్పీకర్‌పై విసిరారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

స్పీకర్‌పై పేపర్లు విసరడం మర్యాద కాదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. పేపర్లు చింపి ఇలా చేస్తూ స్పీకర్‌ను అవమానిస్తున్నారు. మీరు సభా సంప్రదాయాను తప్పుతున్నారని మండిపడ్డారు. ఇది మర్యాద కాదు.మీరు అసలు సభలో ఉండాలనుకుంటున్నారో.. లేదో తేల్చుకోండి. మీరు సభా సంప్రదాయాలు తప్పితే.. మేం కూడా రెచ్చిపోవాల్సి ఉంటుంది.సభలో ఉంటారా? మార్షల్స్తో నెట్టించుకుంటారా? అనేది మీ ఇష్టం. కానీ విలువైన సమయాన్ని వృథా చేయవద్దు' అని అన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)