పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీపై ఈ సమావేశంలో సీఎం అధికారులతో సమీక్ష జరిపారు. 5,18,740 ట్యాబ్‌లను కొనుగోలు చేయనున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. ట్యాబ్‌ల్లో బైజూస్ కంటెంట్ ఇవ్వనున్నారు. తరగతి గదులను డిజిటలీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ టీవీలను,ఇంటరాక్టివ్ టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ అన్నింట్లో కూడా ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
♦టీచర్లకు,8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని సమీక్షించిన సీఎం @ysjagan
♦5,18,740 ట్యాబ్‌లను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం
♦ట్యాబ్‌ల్లో బైజూస్ కంటెంట్
♦తరగతి గదులను డిజిటలీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ టీవీలను,ఇంటరాక్టివ్ టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం.
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) September 12, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)