ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజిట్ ఆంధ్రప్రదేశ్ క్యాంపెయిన్‌లో భాగంగా సీఎం జగన్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించారు. జియో పోర్టల్ ఆధారంగా పర్యాటక సమాచార వ్యవస్థను సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో సులువుగా పర్యాటక ప్రదేశాలను గుర్తించేందుకు వీలుగా రూపొందించిన జీఐఎస్ వెబ్‌పోర్టల్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ మేరకు వచ్చే ఏడాదిని విజిట్ ఆంధ్రప్రదేశ్-2023గా సీఎం జగన్ ప్రకటించారు.
అనంతరం రాష్ట్రంలోని వైవిధ్య ఉత్సవాల బ్రోచర్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. పర్యాటక అభివృద్దిలో కీలకపాత్ర పోషిస్తూ టూరిజం, ట్రావెల్, ఆతిధ్య రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరచాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అరకు నుంచి వచ్చిన గిరిజన థింసా నృత్య కళాకారులతో సీఎం జగన్ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ రజత్ భార్గవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Here's Update
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజిట్ ఆంధ్రప్రదేశ్ క్యాంపెయిన్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించారు. #YSJagan #Andhrapradesh pic.twitter.com/O58B1Z8CeR
— లేటెస్ట్‌లీ తెలుగు (@LatestlyTelugu) September 27, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
