ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమయ్యారు. చెన్నైలోని  సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్, సింగపూర్ కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ ఇవాళ ఉదయం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పవన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, ప్రజల సహకార, సంయుక్త అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.

వీడియో ఇదిగో, మా పోటీ అమరావతితో కాదని రేవంత్ రెడ్డి అంటుంటే చంద్రబాబు ముసిముసి నవ్వులు

ఈ భేటీపై సింగపూర్ దౌత్య కార్యాలయం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. విజయవాడలో ఘనమైన ఆతిథ్యం ఇచ్చినందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొంది. సింగపూర్-ఆంధ్రప్రదేశ్ మధ్య సుదీర్ఘ మైత్రి ఉందని వెల్లడించింది. ఏపీ-సింగపూర్ సంబంధాల బలోపేతం దిశగా ఈ సమావేశం జరగడం అభినందనీయమని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ పేర్కొన్నారు.

Pawan Kalyan meet Singapore Consul-General

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)