మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. నిన్న అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో పవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలతో చిరంజీవి కదిలిపోయారు. తన తమ్ముడికి ఆర్థికంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ మరుసటి రోజే భారీ విరాళం అందించారు. కాగా, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా జనసేన పార్టీకి ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతం ముచ్చింతల్ లో జరుగుతుండగా... పవన్ కల్యాణ్, నాగబాబు షూటింగ్ లొకేషన్ కు వెళ్లారు. తన తమ్ముళ్లకు చిరంజీవి ప్రేమపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగానే జనసేన పార్టీకి ఆశీస్సులు అందిస్తూ, రూ.5 కోట్ల విరాళం తాలూకు చెక్ ను పవన్ కు అందజేశారు. ఈ సందర్భంగా భావోద్వేగాలకు గురైన పవన్ తన పెద్దన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు. షూటింగ్ స్పాట్ లోనే కొణిదెల బ్రదర్స్ ముగ్గురూ కాసేపు మాట్లాడుకున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)