ఉండవల్లి కరకట్ట దగ్గర టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్‌ని పోలీసులు ఆపారు. ఆయన కాన్వాయ్‌లోని ప్రతి కారును చెక్ చేశారు. ఒక్కరోజే రెండుసార్లు చెక్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా తనిఖీలు చేస్తున్నామని లోకేష్‌కి చెప్పారు పోలీసులు. పోలీసుల తీరుపై లోకేష్ మండిపడ్డారు.. వైఎస్సార్‌సీపీ నేతల కార్లు ఎందుకు ఆపి సోదాలు చేయడం లేదని పోలీసుల్ని ప్రశ్నించారు. టీడీపీ నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అన్నారు.
ఎన్ని సార్లు కారు ఆపుతారు అంటూ పోలీసులపై నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. ఎన్నికల కోడ్ పేరిట పోలీసులు తన వాహనాన్ని పదేపదే ఆపుతున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. డీజీపీని తమాషాలు ఆడొద్దని చెప్పండంటూ స్థానిక పోలీసు అధికారిని హెచ్చరించారు. దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారికి రూ.38 లక్షలు విరాళం ఇచ్చిన నారా లోకేష్, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల సందర్శన
Here's Video
ఎన్ని సార్లు కారు ఆపుతారు అంటూ పోలీసులపై నారా లోకేశ్ ఫైర్
ఎన్నికల కోడ్ పేరిట పోలీసులు తన వాహనాన్ని పదేపదే ఆపుతున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు.
డీజీపీని తమాషాలు ఆడొద్దని చెప్పండంటూ స్థానిక పోలీసు అధికారిని హెచ్చరించారు. pic.twitter.com/BpzgWSPmlw
— Telugu Scribe (@TeluguScribe) March 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)