ఉమ్మడి రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్‌ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. 1980-83లో చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్‌గా ఆమె పనిచేశారు. 1985-89లో వేపంజేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు.

1991-92లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, 1992-93లో మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2002లో నియోజకవర్గాలు పునర్విభజన కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. 2007-09లో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2009లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆమె గెలిచారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Here's AP CMO Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)