రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలును ప్రభుత్వం జనవరి 26కి వాయిదా పడింది. కాగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం మంగళవారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని మార్చుకునేందుకు తగిన సమయం ఇవ్వాలంటూ ఫ్లెక్సీ తయారీదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు.
ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధాన్ని జనవరి 26 నుంచి అమల్లోకి తేవాలని సీఎం ఆదేశించారు. ఈలోగా ప్లాస్టిక్ ఫ్లెక్సీ తయారీదారులకు చేదోడుగా నిలవాలని, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో వారికి అండగా నిలవాలని అధికారులకు సూచించారు. ఫ్లెక్సీ తయారీదారులు సామగ్రిని మార్చుకునేందుకు అవసరం మేరకు రూ.20 లక్షల వరకు పావలా వడ్డీకే రుణాలు ఇప్పించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలును ప్రభుత్వం జనవరి 26కి వాయిదా పడింది. కాగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం మంగళవారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.#AndhraPradesh #banonflexbanners
— లేటెస్ట్‌లీ తెలుగు (@LatestlyTelugu) November 1, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)