ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై గురువారం ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు కొనసాగుతారని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.పరీక్ష రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలో తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఉద్యోగులు తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ ఎదుట సవాల్ చేసింది.
Here's Update
గ్రూప్-1పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం
ఏపీ - 2018 గ్రూప్-1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారంతా ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది.
తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా… pic.twitter.com/Le6CdSvtvf
— Telugu Scribe (@TeluguScribe) March 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)