ఏపీలో దుల్హన్ పథకం అమలు చేయట్లేదంటూ మైనార్టీ పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. పథకం ఎందుకు అమలు చేయట్లేదని గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇవాళ్టి విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున ఏజీ సమాధానమిస్తూ.. వచ్చేనెల 1 నుంచి పథకం అమలు చేస్తున్నట్లు తెలిపి జీవో 39ను ఉన్నత న్యాయస్థానానికి సమర్పించారు. అర్హులకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
ఏపీలో వచ్చేనెల 1 నుంచి దుల్హన్ పథకం అమలు చేస్తున్నట్లు ఏపీ హైకోర్టుకు ప్రభుత్వం తరఫున ఏజీ జీవో 39ను సమర్పించారు. అర్హులకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.#Andhrapradesh #DulhanScheme
— లేటెస్ట్‌లీ తెలుగు (@LatestlyTelugu) September 15, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)