ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించిన సంగతి తెలిసిందే. జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కిట్లను జగన్ అందించారు. జగనన్న విద్యా కానుక కిట్లలో 3 జతల యూనిఫారాలు (క్లాత్), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు ఉంటాయి. ఇంకా బెల్టు, ఒక సెట్ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ ఉంటున్న సంగతి తెలిసిందే. అన్నింటినీ బ్యాగులో పెట్టేసి పిల్లలకు అందిస్తారు. మంగళవారం ఈ కిట్ల పంపిణీని ప్రారంభించిన సీఎం పిల్లలకు ఇచ్చే ఓ బ్యాగును భుజానికేసుకుని ఫొటోలకు ఫోజిచ్చారు.
ఈ తరం, వచ్చే తరం... పేదరికం సంకెళ్లను తెంచుకోవాలి, రాష్ట్రంలో ప్రతి ఇంట్లోకూడా ఆనందాలు, అభివృద్ధిని చూడాలన్నది నా సంకల్పం. విద్యారంగంలో 9 కార్యక్రమాలు చేపట్టాం : సీఎం pic.twitter.com/JyjkjkySmG
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 5, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)