జగనన్న విద్యా కానుక కార్య‌క్ర‌మంలో క‌ర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. ప్రైవేట్ విద్యా సంస్థ‌ల‌తో పాటు ప‌లు వ్యాపారాలు క‌లిగిన బుట్టా రేణుక‌... 2014 ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా వైసీపీలో చేరి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూ క‌ర్నూలు ఎంపీ టికెట్‌ను సాధించారు. ఎన్నిక‌ల్లో విజ‌యం కూడా సాధించారు. అయితే 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ విప‌క్షానికి ప‌రిమితం కావ‌డంతో రేణుక టీడీపీలో చేరిపోయారు. అయితే 2019 ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితిని అంచ‌నా వేసి తిరిగి వైసీపీ గూటికే చేరారు. అయితే పార్టీ కష్టాల్లో ఉన్న స‌మయంలో పార్టీని వీడిన వారికి టికెట్లు ఇచ్చేది లేద‌ని జ‌గ‌న్ చెప్పినా... సీటు ద‌క్క‌కున్నా ఫ‌రవా లేదు గానీ... పార్టీలోకి అయితే వ‌స్తానంటూ ఆమె వైసీపీలో చేరిపోయారు. 2019 ఎన్నిక‌ల నాటి నుంచి దాదాపుగా క‌నిపించ‌ని బుట్టా రేణుక మంగ‌ళ‌వారం నాటి జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో వేదిక‌పై క‌నిపించారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)