ఏపీలో సంతల్లో బహిరంగంగానే అక్రమ మద్యం (Illegal Liquor) అమ్మకాలు జరుగుతున్న ఘటన కలకలం రేపింది. పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా తణుకులో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. స్థానిక సంత మార్కెట్‌లో కొంతమంది బెంచ్‌లపై మద్యం బాటిళ్లను పెట్టుకుని దర్జాగా బహిరంగ మద్యం అమ్మకాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారడంతో కలకలం రేగింది.
ఇవి ఎక్సైజ్, పోలీసు అధికారులు కంట పడడంతో హుటాహుటిన ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. దీంతో నిందితులు పరారయ్యారు. అయితే ఫోటోలు, వీడియోల ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ (Arrest) చేసినట్లు ఎక్సైజ్ సీఐ మణికంఠ రెడ్డి, పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. నిందితులను తణుకు పట్టణానికి చెందిన షేక్ మున్న, కొప్పిశెట్టి శివశంకర్, కొల్లి సుకన్యలుగా గుర్తించారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి రూ.7,800 విలువైన 60 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
selling liquor openly in Tanuku
ఇంట్లో మద్యం విక్రయాలు...........!
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో బెల్ట్ షాప్ నిర్వాహకులు బరితెగించారు.. తణుకు సంత మార్కెట్‌లో బహిరంగంగా మద్యం అమ్ముతూ కెమెరాకు చిక్కారు.. నూతన మద్యం పాలసీ అమలులో భాగంగా మద్యం దుకాణాల సంఖ్య తగ్గించడం.. పలు గ్రామాల్లో దుకాణాలు లేకపోవడాన్ని కొందరు… pic.twitter.com/rANlIrSWTW
— ChotaNews (@ChotaNewsTelugu) October 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)