AP రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా 16 జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని ప్రకటించింది. మిగతా చోట్ల స్వల్పంగా వానలు పడే అవకాశం ఉందని.. అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. ఈ మేరకు వివరాలను ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది
As per IMD 26th July Moderate rain is likely to occur at isolated places in the Srikakulam,Vizinagaram, Parvathipurammanyam, Alluri SitharamaRaju,Anakapalli, Visakhatpantam, EastGodavari, Konaseema,Kakinada,West Godavari,Eluru,Krishna,NTR, Guntur,Palnadu & Bapatla districts.
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) July 25, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)