సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో సోమవారం సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్పరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘‘రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన వాటిని ఆర్బీకే(రైతు భరోసా కేంద్రం)ల ద్వారా అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంపై మరింత పరిశోధన జరగాలి. నేచురల్‌ వ్యవసాయం కోసం కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులివ్వాలి’’ అని సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్బీకేలపై నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రశంసలు కురిపించారు. ఆర్బీకేలు అందిస్తున్న సేవలు నిజయంగా అభినందనీయమని తెలిపారు.

సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో సదస్సు. ఈ స‌ద‌స్సులో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా పాల్గొన్న ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌. #YSRCP #CMYSJagan #NitiAayog pic.twitter.com/cE1dD5F20V

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)