ఏపీలో కోనసీమ జిల్లా పి.గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి అస్వస్థతకు గురైన ఆయనను రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కు గురయినట్టు, మెదడులో రక్తం గడ్డకట్టినట్టు స్కానింగ్ లో తేలింది. ఆ వెంటనే ఆయనను హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన కుమారుడు వికాస్ మాట్లాడుతూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)