ఆంధ్రప్రదేశ్ | గత 30 ఏళ్లలో వివిధ కేసుల్లో పట్టుబడిన 14 వేల కిలోల గంజాయిని ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పోలీస్ కమిషనర్ కంఠీ రాణా టాటా సమక్షంలో పోలీసులు దహనం చేశారు. ఇక అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కోడూరులో శనివారం ఐదు జిల్లాల పరిధిలో సీజ్ చేసిన గంజాయి, ద్రవరూప గంజాయి (యాస్ ఆయిల్)ని దహనం చేశారు. 929 కేసుల్లో పట్టుబడిన 1,93,384.50 కిలోల గంజాయి, 133 కిలోల యాస్ అయిల్‌కు డీఐజీ హరికృష్ణ నిప్పుపెట్టి దహనం చేశారు. దీని విలువ రూ. 240 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.అలాగే గుంటూరు రేంజి పరిధిలోని వివిధ జిల్లాల్లో 10,424 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ త్రివిక్రమ వర్మ తెలిపారు. శనివారం ఈ గంజాయిని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల సమీపంలోని పోలీసు ఫైరింగ్ రేంజ్ వద్ద దహనం చేసినట్లు వెల్లడించారు.
Here's ANI Tweet
Andhra Pradesh | Police burnt 14,000 kg of ganja seized in various cases during the last 30 years, in the presence of Vijayawada Police Commissioner Kanthi Rana Tata in the NTR district pic.twitter.com/x4bwrAV2dg
— ANI (@ANI) December 25, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)