ఏపీలో కొవిడ్ మహమ్మారి ప్రభావం క్షీణదశకు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య బాగా పడిపోయింది. ప్రస్తుతం ఏపీలో 606 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో 11,980 కరోనా పరీక్షలు నిర్వహించగా, 57 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 22 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ఒక్క కేసు కూడా రాలేదు.
అదే సమయంలో 84 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజులో మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,18,858 మంది కరోనా బారినపడగా, వారిలో 23,03,522 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 14,730 మంది మృత్యువాతపడ్డారు.
#COVIDUpdates: 13/03/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,18,858 పాజిటివ్ కేసు లకు గాను
*23,03,522 మంది డిశ్చార్జ్ కాగా
*14,730 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 606#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Xo5pYeg0OL
— ArogyaAndhra (@ArogyaAndhra) March 13, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)