విశాఖపట్నం కంచరపాలెం పోలీస్‌ స్టేషన్ పరిధిలో వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు ఆదివారం అగ్నికి ఆహుతయ్యాయి. వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ వెనుక భద్రపరిచారు. ఆ వాహనాలన్నీ కాలి బూడిదయ్యాయి. ఆకతాయిలు వాహనాలకు నిప్పు పెట్టారా లేక.. సమీపంలోని ఇండస్ట్రియల్‌ డంపింగ్‌ యార్డులో వ్యర్థాల నుంచి మంటలు వ్యాపించి అంటుకున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం స్టేషన్ ప్రాంగణంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో 27 ద్విచక్రవాహనాలు, నాలుగు కార్లు, ఒక ఆటో దగ్ధమయ్యాయి. అగ్నికి ఆహుతైన వాహనాల విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)