అల్లూరి జిల్లా రంపచోడవరంలో దారుణం చోటు చేసుకుంది. రంపచోడవరం గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అరాచకం వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల పై 100 నుండి 200 గుంజీలు (సిట్ అప్స్) తీయించడంతో నడవలేక కాళ్లవాపులతో విద్యార్థినిలు అవస్థలు పడ్డారు. సికిల్ సెలెమియా వ్యాధితో బాధపడుతున్న విద్యార్థినులకు కూడా గుంజీలు తప్పలేదు.

దొంగతనానికి వచ్చిన దొంగకు పులిహోర తినిపించి దేహశుద్ధి చేసిన యువకులు.. వైరల్ వీడియో ఇదిగో..!

సీసీ కెమెరాలు లేని చోటుకు తీసుకుని వెళ్లి పనిష్మెంట్ పేరుతో సిబ్బంది గుంజీలు తీయించారు. బాత్రూమ్స్ క్లీనింగ్ కూడా విద్యార్థినులతో చేస్తున్నారని విద్యార్థునులు ఆరోపిస్తున్నారు. ఒకసారి గుంజీలు తీసిన విద్యార్థినులతో మరల పనిష్మెంట్ పేరుతో గుంజీలు తీస్తున్న ఆ ప్రిన్సిపాల్ మాకు వద్దని విద్యార్థినిలు వాపోతున్నారు. వెంటనే ఈ ప్రిన్సిపాల్ ను ఇక్కడ నుండి పంపించేయాలని డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు గిరిజన సంఘం నాయకుల చొరవతో హుటాహుటిన కాళ్ల నొప్పులతో నడవలేని విద్యార్థినులను అంబులెన్స్లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు అధికారులు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)