యువగళం’ (Yuvagalam) పాదయాత్రలో టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh)ను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. చిత్తూరు (Chittoor) జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఆత్మకూరు నుంచి 14వ రోజు లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు.సంసిరెడ్డిపల్లెలో ప్రజలను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చాలా సేపు స్టూల్‌పైనే నిలుచుని నిరసన తెలిపిన లోకేశ్.. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మాది అంబేడ్కర్ రాజ్యాంగం. మమ్మల్ని అడ్డుకోమంటున్న మీ సొంత రాజ్యాంగంతో మాకు పనిలేదని లోకేశ్ వ్యాఖ్యానించారు.
Here's ANI Tweet
Andhra Pradesh | TDP workers today had an argument with police personnel during TDP leader Nara Lokesh's padayatra in Chittoor district. pic.twitter.com/IZi7GX2oUQ
— ANI (@ANI) February 9, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)