అల్లూరి జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. ఏడో తరగతి బాలికపై టెన్త్ విద్యార్థినులు దాడి చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన ముగ్గురిని హాస్టల్ నుంచి ఇంటికి పంపేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇక విశాఖలో మరోసారి ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. దీంతో, ర్యాగింగ్ విషయం పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల ప్రకారం.. విశాఖలోని దువ్వాడలో ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ తీవ్ర కలకలం సృష్టించింది. ర్యాగింగ్‌లో భాగంగా సీనయర్లు, జూనియర్లు తన్నుకున్నారు. ఈ క్రమంలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో, ర్యాగింగ్ వ్యవహారం కాస్తా పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. పలువురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ విషయమై బీఎన్‌ఎస్ 324 సెక్షన్ కింద కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఏడో తరగతి బాలికపై టెన్త్ విద్యార్థినులు ర్యాగింగ్
ఏడో తరగతి బాలికపై టెన్త్ విద్యార్థినుల దాడి..
అల్లూరి జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. ఏడో తరగతి బాలికపై టెన్త్ విద్యార్థినులు దాడి చేశారు. ఈ వీడియో వైరలవడంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన ముగ్గురిని హాస్టల్… pic.twitter.com/1bJHTll2Hi
— ChotaNews App (@ChotaNewsApp) February 17, 2025
అల్లూరి జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం.
ఏడో తరగతి బాలికపై టెన్త్ విద్యార్థినులు దాడి.
దాడికి పాల్పడిన ముగ్గురిని హాస్టల్ నుంచి ఇంటికి పంపేయాలని సిబ్బందిని ఆదేశం.
ఈ ఘటన పై విచారణ చేపట్టిన విద్యా శాఖ అధికారులు. ఇలాంటి ఘటనలు… pic.twitter.com/dcVm70EvT0
— greatandhra (@greatandhranews) February 17, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)