బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడని బస్టాండుకు వచ్చి ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో నెలకొంది. అవనిగడ్డ డిపోకు చెందిన బస్సు గుడివాడ బస్టాండు సమీపంలోని కిన్నెర కాంప్లెక్స్ వద్దకు వచ్చింది. అక్కడ రోడ్డు మధ్యలో కారు నిలిపి ఉంది. ముందుకు వెళ్లడానికి దారి లేకపోవడంతో కారు పక్కకు జరగటం కోసం బస్సు డ్రైవర్ రాకేష్ హారన్ కొట్టాడు.
హారన్ కొట్టాడని తీవ్ర ఆగ్రహంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అసభ్య పదజాలంతో దూషిస్తూ బస్సు డ్రైవర్ దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న కొంత మంది ఆర్టీసీ ఉద్యోగులు దాడి ఆపే ప్రయత్నం చేసిన వారు పట్టించుకోలేదు. ఘటనపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. డ్రైవర్‌పై దాడి చేసిన వారిని బేతవోలుకు చెందిన శ్రీనివాస్, ముబారక్ సెంటర్‌కి చెందిన శివ వెంటక నాగేద్రంగా గుర్తించారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. కుక్కల దాడిలో ఎనిమిదేళ్ల బాలుడు మృతి, ప్రకృతి పిలుపు కోసం వెళ్లగా ఒక్కసారి దాడి చేసిన వీధికుక్కలు
Here's Video
ఆర్టీసీ డ్రైవర్ మీద దాడి
గుడివాడ - బస్సుకు అడ్డుగా పెట్టిన కారును పక్కకు తీయమని హారన్ కొట్టినందుకు బూతులు తిడుతూ సిరివెళ్ళ రాకేష్ అనే ఆర్టీసీ డ్రైవర్ మీద దాడి చేసిన ఇద్దరు యువకులు.
శుక్రవారం సాయంత్రం ఘటన జరగగా ఫిర్యాదు చేసినా నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆరోపిస్తున్న… pic.twitter.com/mqyJ3wKxd6
— Telugu Scribe (@TeluguScribe) June 30, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)