విశాఖ గర్జన కోసం జేఏసీ సిద్దమైంది.బుధవారం మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. మూడు రాజధానులకు మద్దతుగా పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ సాధన కోసం జేఏసీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మంత్రి అమర్నాథ్‌ మాట్లాడుతూ.. విశాఖ గర్జనలో అన్ని వర్గాలు పాల్గొంటాయి. ఇప్పటికే అన్ని ప్రాంతాల ప్రజలు విశాఖ రావడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలి అని కోరారు.

మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. విశాఖ గర్జన అంటే పవన్‌ కల్యాణ్‌ నిద్ర లేచారు. విశాఖ గర్జన రోజే విశాఖలో పవన్‌ మీటింగ్‌ అవసరమా?. ఉత్తరాంధ్రకు ఉపయోగపడే రాజధాని ఎందుకు వద్దు?. అమరావతిలో 29 గ్రామాలే.. ఇక్కడ 6వేల గ్రామాలు. ఉత్తరాంధ్ర రైతులు చాలా పేదవాళ్లు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల కోసం నిలుద్దాము అని స్పష్టం చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)