పవిత్ర పండుగ రంజాన్‌ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలియజేశారు. నెలవంక కనిపించడంతో శనివారం దేశవ్యాప్తంగా రంజాన్‌ నిర్వహించనున్నారు. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్‌ పండుగ... సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి అన్నారు.కఠోర ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దానధర్మాలతో దాతృత్వం, సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం.. ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆయన పేర్కొన్నారు.

Here's CMO Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)