ఏపీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బోణీ కొట్టింది. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. టీడీపీ నేతగా ఉన్న నల్లమిల్లికి ఆ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్థి వైసీపీ నేత ఎస్.సూర్యనారాయణరెడ్డిపై 20567 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఏపీలో ప్రస్తుతం కాషాయ పార్టీ ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. 160కి పైగా స్థానాలో లీడింగ్‌లో ఉంది. అటు అధికార వైసీపీ కేవలం 17 చోట్ల ముందంజలో ఉంది. ఇప్పటికే టీడీపీ మూడు చోట్ల విజయకేతనం ఎగురువేసింది. రామండ్రి అర్బన్,రూరల్‌తో పాటు పాలకొల్లులో టీడీపీ విజయఢంకా మోగించింది.
Here's News
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైకాపా అభ్యర్థి, తన సమీప ప్రత్యర్థి ఎస్.సూర్యనారాయణరెడ్డిపై 20567 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.https://t.co/aOrxX5r67R#TDP #TDPWinning #BJp #JSPBJPTDP #nallamilliramakrishnaredy pic.twitter.com/ofY4X6fhZc
— ETVBharat Andhra Pradesh (@ETVBharatAP) June 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)