ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో అధికార వైసీపీకి దిమ్మదిరిగే ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ పులివెందులలో విజయం సాధించినా.. ఈసారి మెజార్టీ తగ్గడం గమనార్హం. సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై జగన్ 61,176 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఆయన ఆధిక్యం ఈసారి 28 వేల ఓట్ల మేరకు తగ్గింది. వైసీపీ ప్రస్తుతం కేవలం నాలుగు స్థానాల్లో విజయం సాధించగా.. మరో ఐదింట్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇలాగే కొనసాగితే ప్రతిపక్ష హోదా దక్కడమూ కష్టమే.
Here's News
పులివెందుల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి 59 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. #andhrapradesh #tdp #winning #chotanews pic.twitter.com/XPsDkzPdZg
— ChotaNews (@ChotaNewsTelugu) June 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)