విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌-2023లో పెట్టుబడుల వరద పారింది. రెండు రోజుల్లో 13 లక్షల 5వేల 663 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 352 ఎంఓయూలు జరిగాయి. జీఐఎస్‌ విజయానికి కృషి చేసిన వారందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 6లక్షల 3వేల 223 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. పారదర్శక పాలనతోనే విజయాలు సాధిస్తున్నామన్నారు.

శాఖలవారీగా పెట్టుబడుల వివరాలు

► ఎనర్జీ విభాగంలో రూ.9 లక్షల 7వేల 126 కోట్లు

► ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగంలో రూ.3లక్షల 35వేల 644 కోట్లు

► ఐటీ అండ్ ఐటీఈఎస్ విభాగంలో రూ.39వేల 636 కోట్లు

► పర్యాటక విభాగంలో రూ.22వేల 96కోట్లు

► వ్యవసాయ విభాగంలో రూ.1,160 కోట్లు

► పశుసంవర్ధక విభాగంలో రూ.1,020 కోట్లు

Here's AP CMO Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)