ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు ఏపీలోని గోదావ‌రి న‌దీ ప‌రివాహక ప్రాంతాలు నీట మునిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వ‌ర‌ద బాధితుల కోసం ఏపీ ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్ర‌భుత్వ వ‌ర‌ద బాధితుల‌కు అందిస్తున్ సాయానికి ద‌న్నుగా నిలిచేందుకు ఏపీ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ముందుకు వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్‌)కు రూ.5 కోట్ల విరాళాన్ని అంద‌జేసింది. ఈ మేర‌కు ఆ సంస్థ త‌ర‌ఫున రూ.5 కోట్ల చెక్కును మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సోమ‌వారం సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అంద‌జేశారు. వ‌ర‌ద ప్రాంతాల్లో బాధితుల‌ను ఆదుకునేందుకు ఈ నిధుల‌ను వాడుకోవాల‌ని ఆ సంస్థ ప్ర‌భుత్వాన్ని కోరింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)