ఏపీలో గడచిన 24 గంటల్లో 39,296 కరోనా పరీక్షలు చేయగా... 10,310 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కడప జిల్లాలో 1,697 కొత్త కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 1,379 కేసులు, గుంటూరు జిల్లాలో 1,249 కేసులు, కృష్ణా జిల్లాలో 1,008 కేసులు గుర్తించారు. అదే సమయంలో 9,692 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మృత్యువాత పడ్డారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు 14,606 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,70,491 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 21,39,854 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,16,031 మంది చికిత్స పొందుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)