Fact Check: నిర్దిష్ట వైద్య పరిస్థితులు ఉన్న విద్యార్థులకు ఉత్తీర్ణత మార్కులు, సోషల్ మీడియా వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
పదవతరగతి పరీక్షా ఫలితాలపై సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మెడికల్ కండిషన్ బాగాలేని ఓ చిన్నారికి ప్రభుత్వం ఉతీర్ణత మార్కులు వేస్తుందంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ చేస్తున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం తన ట్విట్టర్ పేజీ FactCheck.AP.Gov.inలో క్లారిటీ ఇచ్చింది.
ఏపీ పదవతరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించారు. రికార్డు స్థాయిలో తక్కువ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫలితాలను విడుదల చేసింది. 4,14,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 67.26 శాతం ఉత్తీర్ణత (Manabadi result out 67.27% pass) సాధించారు. అయితే పదవతరగతి పరీక్షా ఫలితాలపై సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం తన ట్విట్టర్ పేజీ FactCheck.AP.Gov.inలో క్లారిటీ ఇచ్చింది.
మార్కుల మార్గదర్శకాల ప్రకారం, నిర్దిష్ట వైద్య పరిస్థితులు ఉన్న విద్యార్థులకు ఉత్తీర్ణత మార్కులు మంజూరు చేయబడతాయి.చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగడం శోచనీయం. దయచేసి తప్పుదారి పట్టించే సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు ధృవీకరించండి అని తెలిపింది
As per the Marks guidelines, the students who have specific medical conditions are granted passing marks.
The false propaganda being played on social media mocking the medical condition of a child is deplorable. Please verify before posting misleading information. #FactCheck pic.twitter.com/5RFdCaVQwm
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) June 7, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 07, 2022 01:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

