వందే భారత్ ట్రైన్ లో పోగలు వెలువడ్డాయి. తిరుపతి-హైదరాబాద్ వందేభారత్ రైలులో ఈ ఘటన జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ రైలులో పొగలు వెలువడ్డాయి. రైలు టాయిలెట్‌లో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో రైలు నిండా పొగలు కమ్ముకున్నాయి. గూడూరు-మనుబోలు మధ్య రైలును నిలిపివేశారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. పొగలు వెలువడడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

మూడో బోగీలోని బాత్‌రూమ్‌ నుంచి పొగలు రావడంతో సిబ్బంది వెళ్లి పరిశీలించారు. బాత్‌రూమ్‌లో కాల్చి పడేసిన సిగరెట్ ముక్క ప్లాస్టిక్‌ సామగ్రికి అంటుకోవడం వల్లే పొగ వ్యాపించిందని నిర్ధరించారు. ఈ ఘటనకు బాధ్యుడైన టికెట్‌ లేని ప్రయాణికుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేసి రైలును పంపివేశారు. దీంతో అరగంటకుపైగా రైలు నిలిచిపోయింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Fumes in Vande Bharat train between Gudur - Manubolu

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)